కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షం (Heavy Rains) పడుతోంది. అల్లూరి, ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. అల్లూరి జిల్లా అరకులోయలో వర్షం కుమ్మేస్తోంది. అటు కాకినాడ, రాజమండ్రి, రాజానగరం, పిఠాపురంలోనూ భారీ వర్షం పడుతోంది. ముఖ్యంగా పిఠాపురంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు బీభత్సం కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ద్రోణి ప్రభావంతో గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గురువారం కోస్తాంధ్ర జిల్లాలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం (Heavy Rains) కురుస్తుందని పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని హెచ్చరించింది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించింది.
Read Also: పిల్లల భద్రతే ముఖ్యం.. ప్రతి పేరెంట్ తప్పక చెప్పాల్సిన సేఫ్టీ రూల్స్
Follow Us On: X(Twitter)

