Mobile Popup Ad
Mobile Popup Ad

వరల్డ్‌కప్‌లో నార్వే బోణీ.. హాలాండ్ అదరగొట్టాడు!

కలం, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్‌కప్‌లో (FIFA World Cup) నార్వే జట్టు ఘనంగా బోణీ కొట్టింది. బుధవారం బోస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఐ’ తొలి మ్యాచ్‌లో నార్వే 4-1 గోల్స్ తేడాతో ఇరాక్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ అరంగేట్రంలోనే రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ భారీ విజయంతో నార్వే (Norway) జట్టు గ్రూప్ ‘ఐ’ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ శతాబ్దంలో ఈ రెండు జట్లు ప్రపంచకప్ బరిలోకి దిగడం ఇదే తొలిసారి.

మ్యాచ్ ఆరంభంలోనే డేవిడ్ మోల్లర్ వోల్ఫ్ ఇచ్చిన క్రాస్‌ను అందుకున్న హాలాండ్.. నార్వేకు (Norway) తొలి గోల్ అందించాడు. కాగా, ఈ మ్యాచ్ బరిలోకి దిగిన గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ (35 ఏళ్ల 279 రోజులు) నార్వే తరఫున వరల్డ్‌కప్ ఆడిన అత్యంత వృద్ధ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత పది నిమిషాలకే ఇరాక్ ప్లేయర్ ఐమెన్ హుస్సేన్ హెడర్ ద్వారా గోల్ చేసి స్కోరును సమం చేశాడు. అయితే హాఫ్ టైమ్‌కు ముందే ఇరాక్ రక్షణ శ్రేణి పొరపాటును అనుకూలంగా మార్చుకున్న హాలాండ్.. తన రెండో గోల్‌తో నార్వేకు మళ్లీ ఆధిక్యాన్ని అందించాడు.

వరల్డ్‌కప్ చరిత్రలోనే నార్వే జట్టుకు ఇదే మొదటి హాఫ్ టైమ్ ఆధిక్యం. ఈ 2026 వరల్డ్‌కప్‌లో మొదటి మ్యాచ్‌లోనే రెండు గోల్స్ చేసిన ఆరో ఆటగాడిగా హాలాండ్ రికార్డు సృష్టించాడు. ద్వితీయార్థంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లీగో ఓస్టిగార్డ్.. మైదానంలోకి వచ్చిన మూడున్నర నిమిషాలకే హెడర్ ద్వారా నార్వేకు మూడో గోల్ అందించాడు. ఆ తర్వాత మ్యాచ్ ముగిసే సమయంలో ఇరాక్ ఆటగాడు హుస్సేన్ ఓన్ గోల్ చేయడంతో నార్వే 4-1తో విజయాన్ని ఖరారు చేసుకుంది.

మ్యాచ్ అనంతరం హాలాండ్ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌లో మంచి పరుగును అందుకోవడం గర్వంగా ఉందన్నాడు. రాబోయే మ్యాచ్‌లు మరింత కఠినంగా ఉంటాయని, ఇంకా బాగా ఆడాల్సి ఉందన్నాడు. తమ విజయం పట్ల దేశ ప్రజలంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ ఫలితంతో నార్వే గ్రూప్ టాప్‌లో ఉండగా.. ఇరాక్, సెనెగల్ జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Read Also: LA 2028 ఒలింపిక్స్ ప్రీ-క్వాలిఫయర్‌కు మెక్సికో వేదిక

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>