శ్రీకాళహస్తి(Srikalahasti) జనసేన మాజీ ఛైర్మన్ కోట వినుత(Kota Vinutha) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె డ్రైవర్ రాయుడును వాళ్లే చంపారని జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. తనపై కుట్ర జరుగుతోందని, అతి త్వరలో ఆధారాలన్నీ బయట పెడతానని అన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘చేయని తప్పుకు జైలుకు వెళ్లినందుకు కూడా బాధగా లేదు. కానీ, మేమే చంపామని అంటున్నారు. అందుకు చాలా బాధేస్తోంది. ఈ ప్రచారం సరైనది కాదు. రాయుడు హత్యలో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. అందుకే 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల రూపాయలు జీతాలు వదులకుని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు. మాది అలాంటి మనస్తత్వం కాదు’’ అని ఆమె చెప్పారు.
‘‘ఈ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకుని బయటపడతాం. న్యాయస్థానంలో విచారణలో ఉండటం వల్ల ఈ అంశం గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదని న్యాయవాదులు తెలిపారు. నాపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలు, ఆధారాలు అన్నీ త్వరలో మీడియా ముందు ఉంచుతా. ఎప్పటికయినా న్యాయం గెలుస్తుంది’’ అని ఆమె(Kota Vinutha) అన్నారు.
Read Also: వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోను: చంద్రబాబు

