Mobile Popup Ad
Mobile Popup Ad

ఆస్తులు నా అజెండా కాదు: వైఎస్ షర్మిల

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తన తల్లి విజయమ్మ (Vijayamma) లేఖపై మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ప్రెస్‌మీట్‌లో ఆస్తుల గురించి అసలు మాట్లాడలేదు. ఆస్తుల కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. విజయమ్మ లేఖ నిజం కాకపోతే జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు.

“వివేకా మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించింది.. అవినాష్ రెడ్డి కాదా?” అని ఆమె అన్నారు. నేను హత్య గురించి మాట్లాడితే, వైసీపీ ఆస్తుల గురించి మాట్లాడుతోంది. నా రాజకీయ ప్రయాణం ఆస్తుల కోసం కాదు, ప్రజా సమస్యల కోసం అని ఆమె (YS Sharmila) స్పష్టం చేశారు.

విజయమ్మపై ఒత్తిడిచేసి సంతకం పెట్టించారనే ఆరోపణలు వాస్తవం కాదు. ఒకవేళ నేను ఒత్తిడి చేస్తే, ఆ సంతకం నాది కాదని విజయమ్మ చెప్పలేరా.. జగన్ తన సైన్యంతో సోషల్ మీడియాలో మాట్లాడించడం ఎందుకు ? తనకు మాట్లాడే ధైర్యం లేదా అని అన్నారు.

Read Also: రాజకీయ ధురంధరుడు చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: పవన్ కళ్యాణ్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>