Mobile Popup Ad
Mobile Popup Ad

అప్పు తీర్చలేదని కల్లు సీసాతో దాడి..

కలం, మెదక్ బ్యూరో : అప్పు తీర్చలేదనే కారణంతో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా కంది మండలం కలివేముల గ్రామానికి చెందిన మండేలా అనిల్ గౌడ్ (35) వ్యక్తిపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. కలివేముల గ్రామంలో కల్లు దుకాణం నిర్వహిస్తున్న అనిల్ అదే గ్రామానికి చెందిన తలారి పండు వద్ద అప్పుగా లక్ష రూపాయలు తీసుకున్నాడు. సోమవారం అనిల్ కల్లు షాపు వద్దకు వచ్చి తమ లక్ష రూపాయలు ఇప్పుడే ఇవ్వాలని తలారి పండు, అతని భార్య సునీత డిమాండ్ చేశారు.

అయితే, అనిల్ తన వద్ద రూ. 50వేలు మాత్రమే ఉన్నాయని.. మిగతావి తర్వాత ఇస్తానని చెప్పడంతో సునీత కల్లు సిసాతో దాడి చేసింది. అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు ఒక్కసారిగా మూకుమ్మడిగా అనిల్ పై దాడి చేశారు. ఈ దాడిలో స్పృహ తప్పి పడిపోయిన అనిల్ ను గ్రామస్తులు స్థానిక సంగారెడ్డి (Sangareddy) ఆసుపత్రికి తరలించారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం హుండీలో నకిలీ నోట్లు

Follow Us On: Youtube

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>