విశాఖను ప్రపంచస్థాయి నగరంగా చేస్తాం: CM చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: విశాఖను ప్రపంచస్థాయి నగరంగా చేస్తామని సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, నెల్లూరులో బీపీసీఎల్ రాబోతుందని ఆయన అన్నారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్‌ (ArcelorMittal Steel Plant)కు కేంద్ర మంత్రి కుమారస్వామి (Kumaraswamy), పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. మూడేళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతిని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రేర్ ఎర్త్ మినరల్స్‌ హబ్‌గా విశాఖ తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జులైలో ప్రారంభిస్తామని ప్రకటించారు. 5,465 ఎకరాల్లో ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కాబోతుందన్నారు. ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు.

భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు..

ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు భూములిచ్చిన రైతులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ స్టీల్‌ప్లాంట్‌ను రెండు దశల్లో పూర్తి చేస్తామన్నారు. ఇవాళ స్టీల్‌ప్లాంట్‌కే కాదు… స్టీల్‌ సిటీకి పునాది వేశామని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్సెలార్ మిత్తల్‌ స్టీల్‌నే ప్రపంచంలో అధికంగా వినియోగిస్తున్నారని చెప్పారు. 2028 డిసెంబర్‌ నుంచి స్టీల్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్‌ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌ నుంచి.. స్పీడ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు వెళ్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రికార్డుస్థాయిలో భూసేకరణ చేశామని తెలిపారు. దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుందన్నారు. ఏపీలో ఉన్నన్ని వనరులు ఎక్కడా లేవని చెప్పారు. అద్భుత విజయాలకు ఏపీని కేంద్రంగా పెట్టుబడిదారులు చేసుకోవాలని సూచించారు.

నక్కపల్లిలో అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌..

ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో (Nakkapalli) కొత్తచరిత్ర తిరగరాస్తున్నామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. విశాఖ ఉక్కు కంటే.. అతిపెద్ద పరిశ్రమను రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతుందని చెప్పారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ పెట్టుబడి గొప్ప మలుపు అని అభివర్ణించారు. భారత్‌లోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌ నక్కపల్లిలో ఏర్పాటు కాబోతుందని చెప్పారు. ప్రపంచంలోనే నంబర్‌వన్‌ ఉక్కు పరిశ్రమగా ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ కాబోతుందని అన్నారు. కేంద్రం సహకారం ఉండటం వల్లే ఈ ప్లాంట్‌ సాధ్యం అయ్యిందన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన చేస్తామని హామీ ఇచ్చామని.. ఇచ్చిన హామీలను 20 నెలల్లో పూర్తి చేశామన్నారు. ఏ పని తలపెట్టిన బేషరతుగా మద్దతు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేసిన మంత్రి లోకేష్‌ (Lokesh)కు అభినందనలు తెలిపారు.

Read Also: రాజకీయ ధురంధరుడు చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: పవన్ కళ్యాణ్

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>