రాజకీయ ధురంధరుడు చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: పవన్ కళ్యాణ్

కలం, వెబ్ డెస్క్: ఆర్సెలార్‌ మిత్తల్‌ స్టీల్‌ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్‌ప్లాంట్ (ArcelorMittal Steel Plant) భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. స్టీల్‌ప్లాంట్‌ ద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ పెట్టుబడులు తమలో విశ్వాసాన్ని పెంచిందన్నారు. పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నేత కావాలని ఎన్నికల్లో చెప్పానని.. లక్ష్మీమిత్తల్‌ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని కొనియాడారు.

రాజకీయ ధురంధరుడు చంద్రబాబు (Chandrababu) వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబే కారణమని అమిత్‌షా చెప్పారని గుర్తు చేశారు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్ట్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని చెప్పారు. అత్యాధునిక సాంకేతికతతో గ్రీన్‌ఫీల్ట్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కాబోతుందన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్‌ ద్వారా ఈ ప్రాంత దిశాదశ మారుతుందని అభిలషించారు. రూ.1.30 లక్ష కోట్ల పరిశ్రమకు భూమిపూజ వేయడం సంతోషంగా ఉందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక పెట్టుబడులకు సానుకూలత కల్పించామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే.. పెట్టబడులు సాధిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ పెట్టుబడులు వచ్చాయన్నారు.

సీఎం చంద్రబాబు శ్రద్ధ, చొరవతో ఏపీ వేగంగా దూసుకుపోతుందని కేంద్ర మంత్రి కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. డబుల్‌ ఇంజిన్ సర్కార్‌ వల్ల ఏ విధంగా అభివృద్ధి జరుగుతోందో ఏపీనే నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వల్ల ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. నారా లోకేష్‌.. తండ్రికి తగ్గ తనయుడు అని, లోకేష్‌కు మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమలో అనేక సంస్కరణలు, విధానాలు తీసుకొస్తున్నామని చెప్పారు. దిగుమతులు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తున్నామని వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్థికంగా మద్దతు ఇచ్చామని.. ఈ పరిశ్రమలో ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టామని వివరించారు. మరో కేంద్రమంత్రి వర్మ (Minister Varma) మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌కు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. రైతుల త్యాగాల ఫలితంగానే ఇవాళ భూమిపూజ చేసుకున్నామని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌కే కాదు… వికసిత్ ఆంధ్రప్రదేశ్‌ కు పునాది వేశామని అభివర్ణించారు. లోకేష్ కృషి, చొరవ వల్లే… ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ ఏపీకి వచ్చిందన్నారు. స్టీల్‌ప్లాంట్ ద్వారా లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలువస్తాయని చెప్పారు. 18 నెలల్లోనే అన్నీ అనుమతులు పూర్తి చేసుకొని భూమిపూజ చేసుకోవడం రికార్డు అని పేర్కొన్నారు.

Read Also: విశాఖను ప్రపంచస్థాయి నగరంగా చేస్తాం: CM చంద్రబాబు

Follow Us On: X(Twitter)

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>