కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధికారులకు ఆదేశించారు.రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా వివిధ శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, ప్రతి కార్యక్రమం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం (Chandrababu) మాట్లాడుతూ, ఈ ఏడాదిలోనే 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మరో 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇసుక సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఇసుకపై అధిక ధరలు వసూలు చేయకుండా కఠినంగా పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు సమయానికి, పారదర్శకంగా అమలు కావాలని, అందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Read Also: ఏపీ ఎండోమెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
Follow Us On : WhatsApp

