కలం, వెబ్ డెస్క్: అక్రమాస్తుల కేసులో ఏపీ ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి(Endowment Officer Shanti)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఆమె నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సుమారు 10 గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో భారీగా బంగారం, నగదు, విలువైన ఆస్తి పత్రాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. శాంతి పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై కూడా భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆమెను (Endowment Officer Shanti) అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ అనంతరం తాడేపల్లి నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమాస్తుల మూలాలు, లావాదేవీలపై కూడా లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Read Also: ముంబైలో అద్భుతం: వీడియో కాల్‌లో డెలివరీ.. ‘3 ఇడియట్స్’ సీన్ రిపీట్
Follow Us On: X(Twitter)

