Mobile Popup Ad
Mobile Popup Ad

కాళేశ్వరం ప్రాజెక్ట్ నడపలేం: మంత్రి ఉత్తమ్

కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం(Kaleshwaram) లోని మొత్తం పంప్‌లు నడిపితే తెలంగాణకు ఎంత విద్యుత్తు అవసరమో.. అంత విద్యుత్తు ఒక్క ఈ ఒక్క ప్రాజెక్టే తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా భవన్ లో నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యారేజీల్లో నీరు నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పిందని.. ప్రస్తుతం ఉన్న స్థితిలో ప్రాజెక్ట్ నడపలేమని కుండబద్దలు కొట్టారు.

అలా చేస్తే బ్యారేజీలే కొట్టుకుపోతాయి..

ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు ఇంకా పరీక్షలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కన్నెపల్లి వద్ద నీరు నిల్వ చేసి అక్కడి నుంచి ఎత్తిపోయొచ్చు కదా.. అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదనల్లో అర్థం లేదన్నారు. అలా చేస్తే.. బ్యారేజీల్లో వాటర్ స్టోర్ చేయాల్సి ఉంటుందని.. అదే జరిగితే ప్రాజెక్టే కొట్టుకుపోయి.. కింద ఉన్న ప్రాంతాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

త్వరలోనే తుమ్మడిహెట్టి ప్రాజెక్టుకు..

రూ.38 వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. తుమ్మడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. త్వరలోనే ఆ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెళ్తామని స్పష్టం చేశారు. తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>