Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్ ఆర్టీసీ డిపోలో పాత కార్గో వస్తువుల వేలం

కలం, నిర్మల్ : నిర్మల్ ఆర్టీసీ డిపో (Nirmal RTC Depot)  కార్గో విభాగంలో చాలా కాలంగా నిల్వ ఉన్న పాత కార్గో వస్తువులను (Old Cargo Goods) బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు డిపో మేనేజర్ కే. పండరి తెలిపారు. సంబంధిత యజమానులు తీసుకెళ్లని ఈ వస్తువులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేలం ప్రక్రియ జూలై 9న ఉదయం 11 గంటలకు నిర్మల్ ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేలంలో పాల్గొనాలనుకునే వ్యాపారులు, ప్రజలు, ఆసక్తి గల కొనుగోలుదారులు నిర్ణీత సమయానికి డిపో ఆవరణకు చేరుకుని వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చని సూచించారు. వేలానికి సంబంధించిన నిబంధనలు, ఇతర వివరాలను అక్కడికక్కడే తెలియజేస్తామని డిపో మేనేజర్ కే. పండరి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>