కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో (West Asia) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లోని (Iran) భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం (Indian Embassy) కీలక అడ్వైజరీ జారీ చేసింది. రాబోయే 48 గంటలపాటు భారతీయులందరూ ఎక్కడి వారు అక్కడే సురక్షితంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది. ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలకు దూరంగా ఉండాలని, భద్రతా కారణాల దృష్ట్యా అపార్ట్‌మెంట్ల పై అంతస్తుల్లో ఉండకూడదని ఎంబసీ స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా హైవేలపై ప్రయాణించాల్సి వస్తే.. ఖచ్చితంగా భారత రాయబార కార్యాలయంతో ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని చెప్పింది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎంబసీ అందించే తాజా సమాచారాన్ని గమనిస్తూ ఉండాలని భారతీయులకు విజ్ఞప్తి చేసింది.
మరోవైపు మరికొన్ని గంటల్లో అమెరికా డెడ్ లైన్ యుగియనుంది. ఇరాన్‌ను (Iran) తుడిచిపెడతామని ట్రంప్ వార్నింగ్ ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలు అలర్ట్ అయ్యారు. వంతెనలు, విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఏర్పడ్డారు. తాము ఎలాంటి ఒత్తిళ్లకు లొంగిపోమని ప్రపంచ దేశాలకు చాటిచెప్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Read Also: ముంబైలో అద్భుతం: వీడియో కాల్‌లో డెలివరీ.. ‘3 ఇడియట్స్’ సీన్ రిపీట్
Follow Us On: Instagram

