Mobile Popup Ad
Mobile Popup Ad

చర్చలు సఫలం.. ఆరోగ్య శ్రీ సేవల బంద్ కు తాత్కాలిక విరామం!

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 3000 కోట్ల బకాయిలను చెల్లించాలంటూ ఏప్రిల్ 1 నుంచి ప్రవేటు ఆసుపత్రిలు చేపట్టిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకం (AP Aarogyasri) బంద్ కు తాత్కాలిక విరామం ప్రకటించబడింది. నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల్లో సుమారు రూ. 1000 కోట్లను పది రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపుత్రుల అసోషియేషన్ (ఆషా) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెండింగ్ బకాయిల చెల్లింపుపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో నుంచి రాతపూర్వక హామీ వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

నెట్వర్క్ హాస్పిటల్స్ బిల్లులను ప్రతి నెల రూ. 150 కోట్ల నుంచి రూ. 170 కోట్ల వరకు క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించాయి. అంతేకాదు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC) స్కీమ్ పై కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ నివేదిక తర్వాతే దాని అమలు ఉంటుందని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ బంద్ కు తాత్కాలిక బ్రేక్ పడింది. కాగా, పాత బకాయిల సంగతి తేల్చకుండా కొత్తగా ఇన్సూరెన్స్ మోడల్ అమలు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని ఆసుపత్రుల అసోసియేషన్ వ్యతిరేకించింది. తాజాగా ప్రభుత్వంతో చేసిన చర్చలు సఫలం కావడంతో.. ఆరోగ్య శ్రీ (AP Aarogyasri) బంద్ కు తాత్కాలిక బ్రేక్ పడింది.

Read Also: ఏపీ ఎండోమెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>