epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఓటుబ్యాంకు కోసం బంగ్లా వలసల్ని వాడుకున్న కాంగ్రెస్: ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్​: కాంగ్రెస్​ పార్టీ తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి బంగ్లాదేశ్​ అక్రమ వలసలను వాడుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మండిపడ్డారు. ఈ ఓటుబ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల నుంచి అస్సాంను, దేశాన్ని బీజేపీ రక్షిస్తుందన్నారు. ఆదివారం అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ ​దిబ్రూఘర్​లో రూ.10వేల కోట్లతో నిర్మించనున్న బ్రౌన్​ఫీల్డ్​ అమ్మోనియా–యూరియా ప్లాంట్​కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. బంగ్లాదేశ్​ అక్రమ చొరబాట్లను కాంగ్రెస్​ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధాని అన్నారు. పైగా, చొరబాటుదారులు స్థిరపడేలా చేసి ఓటుబ్యాంకును బలోపేతం చేసుకుందన్నారు. వలసల కారణంగా ఇబ్బంది పడుతున్న అస్సాంను, అస్సాం ప్రజలను పట్టించుకోకుండా తమ స్వార్థ రాజకీయాలు కొనసాగించిందని కాంగ్రెస్​పై మండిపడ్డారు.

కాంగ్రెస్​ చేసిన తప్పును బీజేపీ డబుల్​ ఇంజిన్​ సర్కార్​ సరిదిద్దుతోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఏళ్ల తరబడి అస్సాంను పాలించినా కనీసం టీ తోటల కార్మికుల భూ సమస్యలను కూడా కాంగ్రెస్​ పట్టించుకోలేదు. ‘బీజేపీ ప్రభుత్వం వచ్చాక టీ తోటల కార్మికులకు భూ హక్కులు కల్పించాం. గౌరవప్రదమైన జీవితం ఇచ్చాం. నేను చాయ్​వాలాను. నేను కాకపోతే ఇంకెవరు వాళ్లను ఆదుకుంటారు?’ అని మోదీ అన్నారు. కొత్త ఫెర్టిలైజర్​ ఫ్యాక్టరీ భారత ఎరువుల అవసరాలు తీర్చడంలో కీలకమవుతుందని చెప్పారు. ‘2014లో మనదేశం ఎరువుల ఉత్పత్తి సామర్థ్యం 225లక్షల మెట్రికల్​ టన్నులు. పదేళ్లలో మేము దాన్ని 306లక్షల మెట్రిక్​ టన్నులకు పెంచాం. కొత్త ఫ్యాక్టరీ అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం అభివృద్ది అవసరమైన ఎరువులను అందించగలదు’ అని మోదీ చెప్పారు. అంతకుముందు ప్రధాని మోదీ గువాహటిలోని స్వహిద్​ స్మారక్​ క్షేత్రను సందర్శించి, అస్సాం అమరవీరులకు నివాళులర్పించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్​ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ‘జి రామ్​ జి’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>