epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఈసారి రిపబ్లిక్​ డే వెరీ స్పెషల్​.. పరేడ్​లో యానిమల్ కంటింజెంట్​

కలం, వెబ్ డెస్క్​ : వచ్చే రిపబ్లిక్​ వేడుకల నిర్వహణకు భారత సైన్యం వినూత్నంగా సన్నద్ధం అవుతోంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్​లో జనవరి 26 నిర్వహించే రిపబ్లిక్​ పరేడ్ లో భారత సైన్యానికి చెందిన రిమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్​ (ఆర్ వీసీ) ప్రత్యేకంగా ఎంపిక చేసిన జంతువుల బృందం (Animal Contingent) ను తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ జంతువుల బృందం (Animal Contingent) లో రెండు బాక్ట్రియన్​ ఒంటెలు, నాలుగు పోనీలు (పర్వత జాతి గుర్రాలు), నాలుగు డేగలు, పది స్వదేశీ జాతికి చెందిన ఆర్మీ జాగిలాలు, అలాగే ఇప్పటికే సేవల్లో ఉన్న మరో ఆరు శునకాలు ఉన్నాయి. వీటితో భారత ఆర్మీ కవాతు కోసం రిహార్సల్​ చేస్తోంది. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యానిమల్ కంటింజెంట్ ప్రత్యేకంగా నిలవనుంది.

Read Also: ఆటో డ్రైవర్​ టు ఎయిర్​లైన్స్​ ఓనర్​.. ‘శంఖ్​ ఎయిర్​’ చైర్మన్​ ఇన్​స్పైరింగ్​ జర్నీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>