epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆటో డ్రైవర్​ టు ఎయిర్​లైన్స్​ ఓనర్​.. ‘శంఖ్​ ఎయిర్​’ చైర్మన్​ ఇన్​స్పైరింగ్​ జర్నీ

కలం, వెబ్​డెస్క్​: ఫ్లైట్​ జర్నీ చాలా మంది కల. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లకు అదొక అందని ద్రాక్ష. అందుకే మనదేశంలో కోట్లాది మంది రోజూ ఆకాశంలో వెళ్లే విమానాలను చూడగలరు కానీ, వాటిలో ప్రయాణాలు మాత్రం చేయలేరు. అలాంటిది ఒక మధ్యతరగతి వ్యక్తి ఏకంగా విమానాల సంస్థనే స్థాపించడమంటే సాధ్యమా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఓ వ్యక్తి (Tempo Driver to Airline Owner). మనిషి తలుచుకుంటే.. మనసు పెట్టి ప్రయత్నిస్తే.. శ్రమ, పట్టుదల, అంకితభావం తోడైతే సాధించలేనిది, సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయ నాయకులు, బిలియనీర్లు, ట్రిలియనీర్లు మాత్రమే ‘ఎయిర్​లైన్స్’ సంస్థలు స్థాపించగలరు అనే ఆలోచనను మార్చారు. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ప్రస్తుతం ఆకాశాన్ని ఏలే స్థాయికి ఎదిగిన ఆ వ్యక్తి శ్రవణ్​ కుమార్​ విశ్వకర్మ (35). ఇటీవల కేంద్రం ప్రభుత్వం విమానయాన రంగంలో ఆమోదించిన నాలుగు కొత్త ఎయిర్​లైన్స్​లో ఒకటైన ‘శంఖ్​ ఎయిర్’ (Shankh Air) ఎయిర్​లైన్స్​ ఫౌండర్​, ఛైర్మన్​. ఆయన ఇన్​స్పైరింగ్​ జర్నీ ఇదీ..

టెంపో డ్రైవర్​గా మొదలుపెట్టి..

ఉత్తరప్రదేశ్​లోని (Uttar Pradesh) కాన్పూర్​లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు శ్రవణ్​ కుమార్​ విశ్వకర్మ (Shravan Kumar Vishwakarma). చదువు మీద ఆసక్తి లేదు. దానికితోడు స్నేహాలు, చుట్టుపక్కల పరిస్థితుల కారణంగా బడి మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లకు బతుకు పోరాటం మొదలైంది. కుటుంబ సభ్యుల సాయంతో ఒక టెంపో (ఆటో) కొని, దానికి డ్రైవర్​గా మారారు. రోజూ టెంపో నడుపుతూ అంతో ఇంతో సంపాదించడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా మరిన్ని టెంపోలు కొని, ఓనర్ అయ్యారు. అయితే, ఆయన ప్రయాణం అక్కడితో సంతృప్తి చెందనివ్వలేదు. కొన్ని చిన్న చిన్న బిజినెస్​లు ప్రారంభించారు. కానీ, అవేవీ సక్సెస్​ కాలేదు. అయినా నిరాశ చెందలేదు. ప్రయత్నాలు ఆపలేదు.

సిమెంట్​ టు స్టీల్​..

ఈ క్రమంలో 2014లో సిమెంట్​ ట్రేడ్​లోకి దిగారు శ్రవణ్​ కుమార్​. ఈ బిజినెస్​ కుదురుకోవడంతో మెల్లగా విస్తరణ ప్రారంభించారు. 2022లో ‘శంఖ్​ ఏజెన్సీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​’ స్థాపించారు. ఈ కంపెనీ కింద బిల్డింగ్​ మెటీరియల్స్​, సిరామిక్స్​, కాంక్రీట్ ప్రొడక్ట్స్​, హోల్​సేల్​ వ్యాపారం మొదలుపెట్టారు. ఇది విజయవంతమం అయ్యింది. ఆపై వెనుదిగిరి చూసుకోలేదు. ఆ తర్వాత విశ్మకర్మ స్థాపించిన కంపెనీలు, వాటి విస్తరణకు ఇదే మెయిన్​ రెవెన్యూ సోర్స్​ అయ్యింది. ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచింది. ఇందులో మొదటి మేజర్ బిజినెస్​ స్టీల్ ​(టీఎంటీ). ఆ తర్వాత మైనింగ్​, ట్రాన్స్​పోర్టేషన్​లోనూ విశ్వకర్మ కంపెనీలు ప్రారంభమై, లాభాల బాటలో నడుస్తున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం తన కంపెనీలన్నిటికీ అవసరమైన ట్రాన్స్​పోర్ట్​ ట్రక్స్​ సొంతంగానే అందుబాటులో ఉన్నాయి. ‘శంఖ్​ బిల్డర్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​’.. కన్​స్ట్రక్షన్స్​, ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్​ ప్రాజెక్టుల్లో గొప్ప సంస్థగా ఎదిగింది.

అలా శంఖ్​ ఏవియేషన్​ (Shankh Air) ​…

అన్ని బిజినెస్​లూ సక్సెస్​ఫుల్​గా నడుస్తున్నాయి. కానీ, శ్రవణ్​ కుమార్​లో ఇంకా ఏదో సాధించాలనే తపన. అలా ఒకరోజు అతనికి వచ్చిన ఆలోచనే విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు కారణమైంది. అలోచన వచ్చిందే తడవుగా మొదట ఏవియేషన్​ ఇండస్ట్రీ గురించి క్షణ్నంగా తెలుసుకున్నారు. వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మొదలుకొని ఎన్​వోసీ ఎలా తీసుకోవాలి? వంటి అన్ని విషయాలూ అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగారు. శంఖ్​ ఏజెన్సీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​కు అనుబంధంగా శంఖ్​ ఏవియేషన్​ ప్రైవేట్​ లిమిటెడ్ ​(Shankh Air) స్థాపించారు. కేంద్రం అనుమతి ఇవ్వడంతో వచ్చే ఏడాది జనవరి నుంచి శంఖ్​ ఎయిర్​లైన్స్​ విమానాలు ఆకాశంలో ఎగరనున్నాయి. లక్నో నుంచి ఢిల్లీ, ముంబై తదితర మెట్రో నగరాలకు సర్వీసులు నడవనున్నాయి. మొదట మూడు విమానాలతో ప్రారంభించి ఆ తర్వాత మరికొన్ని కొననున్నట్లు శ్రవణ్​ కుమార్​ తెలిపారు. సామాన్యులు సైతం విమానాల్లో ప్రయాణించేలా చేయడమే తమ లక్ష్యమని, పండగ సమయాల్లో టికెట్ రేట్లు పెంచబోమని ఆయన చెబుతున్నారు. తనకు అన్ని ట్రాన్స్​పోర్ట్స్​లాగే ఏవియేషన్​ కూడా ఒకటని, దీన్ని ప్రత్యేకంగా ఏమీ భావించనని అంటున్నారు.

మైండ్​సెట్​ కీలకం: శ్రవణ్​ కుమార్​ విశ్వకర్మ

‘ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పడు ఎదురయ్యే మొదటి సమస్య.. జనం ఏమంటారో, ఏమనుకుంటారో అని భయపడడం. అయితే, దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. అందుకు నేనే ఉదాహరణ. ఒక టెంపో డ్రైవర్​ ఎయిర్​లైన్స్​ నడపగలిగే స్థాయికి వచ్చాడంటే కారణం అదే. ఒకప్పుడు గొప్ప కలలు కనడానికి కూడా భయపడే స్థాయి నుంచి నేడు ఎయిర్​లైన్స్​ స్థాయికి చేరడం వెనక ఉన్నదీ ఇదే. అంతా మన మైండ్​సెట్​లోనే ఉంటుంది’ అని శ్రవణ్​ కుమార్​ విశ్వకర్మ అంటున్నారు.

Read Also: అక్కడ దీక్ష చేస్తా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక ప్రకటన..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>