కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ (The Raja Saab) జనవరి 9న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ముందు రోజు ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. రిలీజ్ కు ఇంకో వారం రోజులు మాత్రమే ఉన్నా సరే ప్రభాస్ (Prabhas) పెద్దగా ప్రమోషన్లలో పాల్గొనట్లేదు. ఎందుకంటే స్పిరిట్ మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. సందీప్ రెడ్డి అసలు గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ చేసేస్తున్నాడు. దీంతో ది రాజాసాబ్ ప్రమోషన్లకు ప్రభాస్ కంటిన్యూగా రాలేకపోతున్నాడంట.
స్పిరిట్ షూటింగ్ లో గ్యాప్ దొరికితే వచ్చేస్తున్నాడు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా టైమ్ స్పిరిట్ మూవీ షూటింగ్ లో టైమ్ దొరికితేనే వచ్చాడు. ప్రభాస్ సినిమాలకు పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ ఉంటుంది. కాబట్టి హిందీ, తమిళ్, కన్నడలో ప్రమోషన్లు చేస్తే మరింత వసూళ్లు పెరిగే ఛాన్స్ లేకపోలేదు. కానీ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్లు చేసేంత టైమ్ కేటాయించలేకపోతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ స్పిరిట్ (Spirit) షూటింగ్ కంటిన్యూగా లేకపోతే ప్రమోషన్ల కోసం వచ్చేవాడేమో అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ సినిమాలకు పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా కలెక్షన్లకు ఢోకా ఉండదని గతంలో సలార్ నిరూపించింది. కాకపోతే సలార్ కేటగిరీ వేరు. పైగా డైరెక్టర్ అక్కడ ప్రశాంత్ నీల్. ఇప్పుడు ది రాజాసాబ్ (The Raja Saab) పూర్తి హారర్ కామెడీ మూవీ. పైగా మారుతి ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ తీయలేదు. కాబట్టి ప్రమోషన్లు చేస్తేనే బెటర్ అనుకున్నా.. స్పిరిట్ షూటింగ్ వల్ల అడ్డంకులు ఏర్పడుతున్నాయని అంటున్నారు నెటిజన్లు.
Read Also: రాజాసాబ్ USA అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు..
Follow Us On: Sharechat


