పలాసలో సినిమా తరహా దోపిడీ.. జీఎస్టీ అధికారులమంటూ బంగారం లూటీ

కలం, వెబ్ డెస్క్ : పలాస (Palasa)లోని ఓ జ్యువెలరీ షాపులో సినిమా తరహాలో దొంగతనం(Cinematic Robbery) జరిగింది. జ్యువెలరీ షాపును లక్ష్యంగా చేసుకున్న నలుగురు దుండగులు, జీఎస్టీ (GST) అధికారులమని చెబుతూ షాపులోకి ప్రవేశించారు. మొదట అధికారిక తనిఖీ చేస్తున్నట్టు నటించిన వారు, కొద్ది సేపటికే తమ అసలు రూపాన్ని బయటపెట్టారు. షాప్ యజమానిని బెదిరించి, అతనికి బేడీలు వేసి  షాపులో ఉన్న సుమారు పావు కేజీ బంగారం తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ సంఘటన పూర్తిగా సినిమా స్టైల్‌లో జరగడంతో చుట్టుపక్కల వ్యాపారులు, ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు  ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జీఎస్టీ అధికారుల వేషంలో వచ్చిన దుండగులు ప్రణాళికాబద్ధంగా ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.

Read Also: రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం: మాజీ మంత్రి రోజా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>