epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

SIRపై మమతా బెనర్జీ లేఖ.. అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. SIR పద్దతిని తప్పుబడుతూ, అందులో మార్పులు చేయాలని సూచిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు మమతా లేఖ రాశారు. దీనిపై స్పందించిన అమిత్ షా.. దేశంలోని కొన్ని రాష్ట్రాలు చొరబాటుదారులను(Infiltrator) రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. అందుకే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆపేయాలంటూ అభ్యర్థిస్తున్నారని అన్నారు. పలు రాష్ట్రాల నుంచి ఇటువంటి అభ్యర్థనలు వస్తున్న క్రమంలో అమిత్ షా వీటిపై స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. దేశ భద్రత పరిరక్షణలో చొరబాటుదారుల నివారణ ఎంతో కీలకమన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే కూడా చొరబాట్లను ఆపాలని, కొన్ని రాజకీయ పార్టీలు వీరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర సవరణ కార్యక్రమానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని, అభ్యర్థనలు చేస్తున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. కాగా అమిత్ షా తన పోస్ట్‌లో ఏ పార్టీ పేరుగానీ, నేత పేరుగానీ ప్రస్తావించలేదు. అయినప్పటికీ తాజాగా ఎన్నికల కమిషనర్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) లేఖ రాయడం, ఆ తర్వాత వెంటనే అమిత్ షా(Amit Shah) స్పందించడంతో.. షా కౌంటర్ మమతకే అన్న చర్చలు మొదలయ్యాయి.

Read Also: అరెస్టు చేసేంత ధైర్యం సీఎం రేవంత్‌కు లేదు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>