Mobile Popup Ad
Mobile Popup Ad

రాజమౌళికి ఆర్జీవీ సపోర్ట్

వారణాసి ఈవెంట్ అనంతరం దర్శకుడు రాజమౌళి(Rajamouli)ని కొందరు టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాను నాస్తికుడినని చెప్పుకోవడం, హనుమంతుడి పాత్రను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా రాజమౌళికి మరో దర్శకుడు ఆర్జీవీ(RGV) మద్దతు పలికారు. రాజమౌళిని విమర్శిస్తున్న వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

“దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం దేవుడిని నమ్మడం, నమ్మకపోవడం కూడా వ్యక్తిగతం‘ అని వర్మ స్పష్టం చేశారు. వ్యక్తిగత విశ్వాసాన్ని కారణంగా తీసుకుని ఒక వ్యక్తిని తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు.

అంతేకాకుండా, ‘ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? హారర్ సినిమా తీయడానికి దెయ్యం అవ్వాలా? అయితే దేవుడిని నమ్మకపోయినా ఆయనపై సినిమా తీయడంలో తప్పెక్కడుంది?” అంటూ సెటైర్‌గా విమర్శకులను ప్రశ్నించారు. దర్శకుడి సృజనాత్మక స్వేచ్ఛపై వివాదం రేపడం అనవసరమని ఆయన(RGV) పేర్కొన్నారు.

ఆర్జీవీ ఇంకా ఒక కీలక వ్యాఖ్య చేశారు. “దేవుడు నాస్తికుల్ని ఏమీ చేయడం లేదు… అసలు సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదు. నమ్మకుండానే ఇంత పెద్ద విజయాలు సాధించడం కొందరికి జీర్ణం కావడం లేదు” అని అన్నారు. ఈ వివాదం వెనక ఉన్న అసలైన అసూయ, అసహనం బయటపడుతోందని వ్యాఖ్యానించారు.

చివరగా, “దేవుడు బాగున్నాడు… రాజమౌళి బాగున్నాడు… అర్థం చేసుకోలేని వాళ్లకే సమస్య” అంటూ ఈ వివాదానికి తన స్టైల్లో ఫుల్‌స్టాప్ పెట్టేలా రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆర్జీవీ ట్వీట్లు వైరల్ అవుతుండగా, ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలికేనా లేక మరిన్ని రియాక్షన్లు వస్తాయా అన్నది చూడాలి.

Read Also: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>