హైదరాబాద్ మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ (Ameerpet) మైత్రీవనంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీనివాసనగర్ వెస్ట్‌లోని మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న KSR ఫ్యాషన్స్ కమర్షియల్ కాంప్లెక్స్ రెండవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు, దుకాణదారులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు.

ఈ అగ్నిప్రమాదం కారణంగా అమీర్‌పేట్ (Ameerpet) నుండి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు జారీ చేశారు. సాధ్యమైనంత వరకు ఈ మార్గంలో ప్రయాణాన్ని నివారించాలని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని దానికి అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు, అత్యవసర సేవల సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని కోరారు.

Read Also: రోలాండ్ గారోస్ సెమీస్‌లో ఆర్నాల్డి.. బెరెట్టినీ గాయం కారణంగా నిష్క్రమణ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>