మాతాశిశు ఆస్పత్రిలో షాకింగ్ ఘటన.. చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్!

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అనుబంధ మాతాశిశు ఆస్పత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆస్పత్రి ఆవరణలో ఆడుకుంటున్న బాబు అదృశ్యం అయ్యాడు. వివరాలలోకి వెళ్తే.. బాల్కొండ మండలంలోని నాగేపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరి పిల్లలతో నిజామాబాద్ మాతా శిశు ఆస్పత్రికి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వైద్యులతో మాట్లాడుతుండగా.. ఇద్దరు పిల్లలు ఆస్పత్రి ఆవరణలో ఆడుకుంటున్నారు. అయితే ఇద్దరిలో రెండున్నరేళ్ల చిన్న బాబును ఓ మహిళ తీసుకెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. బాలుడి మిస్ అయ్యాడనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే 112కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఘటన పై విచారణ చేపట్టారు. కాగా, సీసీ కెమెరా ఫుటేజీలో కిడ్నాపర్‌ మహిళ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు చూసిన పోలీసులు.. నిందితురాలు చాక్లెట్ ఆశచూపి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. బాబు కనిపించకుండా పోవడంతో పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బాబు ఆచూకీ తొందరగా కనిపెట్టి తమ దరికి చేర్చాలని పోలీసుల్ని వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>