ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. పలు కీలక నిర్ణయాలు..!

కలం, వెబ్ డెస్క్ : ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu ) నిర్వహించిన భేటీ ముగిసింది. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలు, ఇతర డిమాండ్లపై జాయింట్ స్టాఫ్ ఆఫ్ కౌన్సిల్ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పలు డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే కీలక నిర్ణయాలకు అంగీకారం తెలిపారు.

ఈ మేరకు ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. అలాగే 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నియామకానికి కూడా సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. అలాగే సరెండర్ లీవ్స్‌కు సంబంధించిన మొత్తాన్ని వచ్చే సంక్రాంతి నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ఈ సమావేశంలో సీఎం నిర్ణయించారు. పోలీసులకు అదనంగా ఒక సరెండర్ లీవ్‌ను ఈ దసరాకే చెల్లించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా, ఉద్యోగుల కోసం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,880 కోట్ల ఆర్థిక భారం పడనుంది.

అయితే ఈ భేటీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని పేర్కొన్నారు. ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. సీఎం హామీపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ డిమాండ్లలో పలు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>