కలం వెబ్ డెస్క్ : కాంగ్రెస్(Congress) పార్టీలో గ్రూప్ రాజకీయాలపై మంత్రి గడ్డం వివేక్(Minister Vivek) కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ రాజకీయాలు తగ్గించుకుంటేనే పార్టీ ముందుకు వెళ్తుందని వ్యాఖ్యానించారు. సిద్ధిపేట(Siddipet)లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బుధవారం సిద్ధిపేట జిల్లాలోని దౌల్తాబాద్‌లో సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, ఉప సర్పంచ్ లను సన్మానించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట మాత్రమే అభివృద్ధి చెందిందని, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) నిధులన్నీ సిద్ధిపేటకే తరలించుకుపోయారని వివేక్ ఆరోపించారు. దుబ్బాక(Dubbaka)లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దుబ్బాకను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలు తగ్గించుకుంటే అభివృద్ధితో పాటు అన్నింటా ముందుకెళ్తామని, రానున్న జడ్పీటీసీ(ZPTC), ఎంపీటీసీ(MPTC) ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి వివేక్(Minister Vivek) సూచించారు.
Read Also: అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం క్షేత్రస్థాయి సమీక్ష
Follow Us On : WhatsApp


