కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర ఎస్సై శ్రీనివాస్ (Keesara SI Srinivas) ఏసీబీకి పట్టుబడ్డారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా కీసరలోని శిల్పా లే అవుట్ వద్ద ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. రెండు కేసుల్లో ఛార్జిషీట్లు త్వరగా కోర్టులో వేసేందుకు గాను ఎస్సై శ్రీనివాస్ బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని ఆశ్రయించగా.. పక్కాగా వలపన్ని పట్టుకున్నారు.
మూడు నెలల్లో మూడో అధికారి..
కీసర పోలీస్ స్టేషన్లో గత మూడు నెలల్లో ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. తాజాగా ఎస్సై శ్రీనివాస్ (SI Srinivas) కూడా పట్టుబడటంతో పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. ఒకే పోలీస్ స్టేషన్లో అధికారులు వరుసగా ఇలా లంచాలు తీసుకుంటూ దొరికిపోవడంపై చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ పోలీస్ అధికారులు పట్టుబడినప్పుడల్లా జనాలు బాంబులు కాల్చి పండగ చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Also Read : ‘రామాయణ’ కేవలం సినిమా కాదు.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

