ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు: అదనపు కలెక్టర్

కలం, ఆదిలాబాద్: ప్రజావాణి లాగిన్‌లోని దరఖాస్తులన్నింటినీకి నిబంధనల ప్రకారం తగిన సమాధానాలు పంపేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను ( (Prajavani Applications)) అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రుతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో 30 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను గుర్తించి, తక్షణమే వాటిని క్లియర్ చేయాలని స్పష్టం చేశారు.

ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఎక్కడా ఆలస్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అలాగే నిర్దేశిత లక్ష్యాలను షెడ్యూల్ ప్రకారం యథావిధిగా, సకాలంలో పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలికల, బాలుర హాస్టళ్లలో మెనూ అమలు, రికార్డుల నిర్వహణ, మౌలిక వసతులపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, ముఖ్యంగా భోజన వసతులు, ఇతర అంశాలపై ఫిర్యాదులు వచ్చినందున ప్రత్యేక కాంప్లెక్సులు, హాస్టళ్లలో క్షుణ్ణంగా పరిశీలన నిర్వహించాలని ఆదేశించారు. హాస్టళ్ల తనిఖీలలో ఏవైనా లోపాలు లేదా ఇబ్బందులు గుర్తిస్తే, వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి తక్షణ విచారణ చేపట్టి పరిష్కరించాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>