కలం, వెబ్ డెస్క్: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ చిత్రం ‘రామాయణ(Ramayana)’పై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దర్శకులు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, శంకర్, నటులు మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కూడా చేరారు.
ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. తాను ఇప్పటివరకు చదివిన, విన్న, చూసిన రామాయణ కథలన్నింటిలోనూ నమిత్ మల్హోత్రా రూపొందించిన రామాయణం ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా గురించి భవిష్యత్తులో ఎప్పుడు మాట్లాడినా నమిత్ మల్హోత్రా పేరు గుర్తుండిపోతుందని అన్నారు. ఆయన కేవలం ఒక సినిమాను రూపొందించలేదని, తరతరాల పాటు గుర్తుండిపోయే వారసత్వాన్ని సృష్టించారని ప్రశంసించారు.
అంతేకాకుండా సినిమాలో నటించిన రణబీర్ కపూర్(Ranbir Kapoor), యశ్, సాయిపల్లవి, కాజల్ నటనలను కూడా ఆర్జీవీ (Ram Gopal Varma) మెచ్చుకున్నట్లు పేర్కొన్నారు. ‘రామాయణ’ను కేవలం సినిమాగా కాకుండా ఒక భక్తి శక్తిగా అభివర్ణించారు. చిత్రంపై వచ్చే విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని చిత్రబృందానికి సూచించారు.
Also Read : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ మూవీ క్రేజీ అప్‌డేట్
Follow Us On: X(Twitter)

