కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాలపై హోంమంత్రి అనిత (Minister Anitha) అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో దీపావళి టపాసుల నిప్పురవ్వల కారణంగా ఆటోమొబైల్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఆస్తి నష్టం జరిగింది.
కృష్ణా జిల్లా గన్నవరంలో బాణసంచా నిప్పుల వల్ల ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. తిరువూరులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మరో దుకాణం దగ్ధమైంది. ఈ మూడు ఘటనలపై మంత్రి ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read : షేక్ హసీనా కీలక నిర్ణయం.. కేంద్రానికి దరఖాస్తు!
Follow Us On : WhatsApp

