కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న ఆమె తన సొంత దేశానికి వెళ్లాలని భావిస్తున్నారు. డిసెంబరులో ఢాకాకు వెళ్లి అక్కడి ప్రభుత్వానికి లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్‌లో కొత్త పాస్‌పోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తాను బంగ్లాకు తిరిగి వెళ్తానని ఇటీవల కాలంలో పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వస్తున్న షేక్ హసీనా.. అందుకు సంబంధించి అధికారిక ప్రయత్నాలు ప్రారంభించారు.
రెండేళ్ల తరువాత..
బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా ఆర్మీ అధికారుల సూచనలతో 2024 ఆగస్ట్ 5వ తేదీన ప్రధానిగా ఉన్న షేక్ హసీనా (Sheikh Hasina) ఉన్నఫళంగా భారత్‌కు వచ్చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధ్యక్షుడికి ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించారు. అనంతరం, ఆమె జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval)ను కలిశాక.. ఢిల్లీలోనే రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆమె అప్పగింత కోసం బంగ్లాదేశ్ పలుమార్లు లేఖలు పంపించినా.. భారత్ వ్యూహాత్మక స్పందన తెలియజేస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారమే భారత్ నడుచుకుంటుందని స్పష్టం చేసింది. రెండేళ్ల తరువాత ఇప్పుడు షేక్ హసీనానే వెళ్లిపోయేందుకు నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది.
Also Read : క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. తగ్గిన 137 ఔషధాల ధరలు
Follow Us On: X(Twitter)

