నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ మూవీ క్రేజీ అప్‌డేట్

కలం, సినిమా : నేచురల్ స్టార్ నాని సమర్పణలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini Movie) షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా నటిస్తుంది.  చెప్పలేని భావోద్వేగాలతో హృదయానికి హత్తుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు చిత్రబృందం పేర్కొంది. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా షూటింగ్ పూర్తికావడంతో ఈ మూవీ విడుదలకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్‌పై చిత్రబృందం దృష్టి సారించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>