పాగుంట వెంకన్న స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే

కలం, జోగులాంబ గద్వాల: కేటీదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలోని పాగుంట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొని లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో వర్షాలు కురిసి, మంచి దిగుబడులు, గిట్టుబాటు ధరలు లభించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఉత్సవాలను సమష్టిగా విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి‌బోయ కార్పోరేషన్ చైర్మన్‌ గట్టు‌ తిమ్మప్ప ,‌ ఆలయ ఈఓ పురేందర్, గ్రామ సర్పంచ్ శారదమ్మ,‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ‌ఆలయ‌ సిబ్బంది‌‌ పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>