కలం, వెబ్ డెస్క్: అబుదాబిలో (Abu Dhabi) రవాణా రంగాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లేలా వాణిజ్య ఎయిర్ టాక్సీ (Air Taxi) సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రోడ్డు, సముద్ర, వైమానిక ప్రయాణాలను అనుసంధానిస్తూ సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఎమిరేట్ వ్యూహంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు.
యూఏఈ ప్రభుత్వ ‘టామ్’ యాప్ తరహాలోనే ఉండే ఈ యాప్ ద్వారా ప్రయాణికులు వివిధ రవాణా మార్గాల ద్వారా ప్రయాణించవచ్చు. బుక్ చేసుకోవడం, చెల్లింపులు చేయడం లాంటివి సులభంగా పూర్తి చేయవచ్చని ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా హమద్ అల్ గ్ఫేలీ వెల్లడించారు. ఈ ఎయిర్ టాక్సీ (Air Taxi) ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం 2024 లోనే ఆర్చర్ ఏవియేషన్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. ఆ తర్వాత 2025లో అబుదాబి ఏవియేషన్ కూడా చేరడంతో వాణిజ్య కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. 2025 జూలై 2న ఎయిర్ ట్యాక్సీని విజయవంతంగా నడిపింది.
Read Also: సోలో రైడ్ టు సోషల్ రైడ్.. బైకర్ల ప్రపంచంలో సరికొత్త ట్రెండ్!
Follow Us On: Instagram

