Mobile Popup Ad
Mobile Popup Ad

అభిజిత్ దీప్కే పిటిషన్.. ఎక్స్ (ట్విట్టర్‌)కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కలం, వెబ్ డెస్క్: తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకుడు అభిజిత్ దిప్కే (Abhijeet Dipke) దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు జూలై 6వ తేదీని గడువుగా నిర్ణయించింది.

కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకుడు అభిజిత్ దిప్కే (Abhijeet Dipke) దాఖలుచేసిన పిటిషన్‌లో, తన అకౌంట్‌ను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దేశ భద్రత కారణాలను చూపుతూ బ్లాక్ చేశారని ఆరోపించారు. ఇది తన భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని, అకౌంట్‌ను వెంటనే పునరుద్ధరించాలంటూ కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై ప్రాథమిక విచారణ చేపట్టిన హైకోర్టు, వెంటనే అకౌంట్ పునరుద్ధరణపై ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వ పక్షం వాదనలు కూడా పూర్తిగా వినాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఉన్నందున ఈ కేసును సాధారణంగా చూడలేమని కోర్టు సూచించింది.

అదే సమయంలో, ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే ఎక్స్ సంస్థను కోర్టు ఆదేశించింది. ఖాతా బ్లాక్ చేయడానికి తీసుకున్న కారణాలు, అనుసరించిన విధానం, చట్టపరమైన ఆధారాలపై వివరాలు సమర్పించాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 6న జరగనుండగా, అప్పటిలోగా తమ వివరణలు సమర్పించాలని కేంద్రానికి ఎక్స్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read Also: కెసీఆర్ ను ఇరికించిన బావాబామ్మర్దులు

Read Also: అరటి తొక్కతో చర్మానికి ఇంత మేలు జరుగుతుందా? షాకింగ్ బ్యూటీ టిప్స్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>