కలం, వెబ్ డెస్క్ : మొబైల్ డేటా వినియోగదారులకు ఎదురవుతున్న సమస్యలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) రాజ్యసభ వేదికగా లేవనెత్తారు. సోమవారం సమావేశాల సందర్భంగా టెలికాం కంపెనీలు చేస్తున్న మోసాన్ని ప్రశ్నించారు. టెలికాం కంపెనీలు రోజువారీ డేటా లిమిట్ (Daily Data Limit) పేరుతో రీఛార్జ్ ప్లాన్‌లు అందిస్తున్నాయని, ఇవి ప్రతి 24 గంటలకు రీసెట్ అవుతాయన్నారు. 2GBలకు డబ్బు చెల్లించి, 1.5GB మాత్రమే వాడితే మిగిలిన 0.5GB అర్ధరాత్రికి మాయమవుతుందని, ఇది రీఫండ్ కావడం లేదని గుర్తు చేశారు. ‘పెట్రోల్, విద్యుత్ వంటి సేవలకు వాడిన మేరకే డబ్బులు చెల్లిస్తాం. కానీ, మొబైల్ డాటా విషయంలో పూర్తి ఛార్లీలు చెల్లించినా.. వాడని డాటా ఉపయోగించని భాగం కంపెనీలు తీసుకుంటున్నాయి. ఇది కస్టమర్లను మోసం చేయడమే’ అని ఎంపీ చద్దా విమర్శించారు.
వాడగా మిగిలిన డేటాను (Daily Data Limit) టెలికాం కంపెనీలన్నీ మరుసటి రోజుకు కలపాలని, రోజు చివర్లో మిగిలిన డేటా తొలగించకుండా తరువాతి రోజు ఉన్న లిమిట్ కు కలపాలని డిమాండ్ చేశారు. లేదా రీచార్జ్ ప్లాన్ లు ఉన్న విలువలో తక్కువ డేటా వాడితే తదుపరి రీచార్జ్ లో డిస్కౌంట్ ఇవ్వాలన్నారు. ఉపయోగించని డేటాకు డబ్బులు చెల్లించకూడదన్నారు. ఉపయోగించని డేటాను డిజిటల్ ఆస్తిగా పరిగణించి, డబ్బు బదిలీ చేసినట్లే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు బదిలీ చేసే సౌకర్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఇండియాలో డేటా కనుమరుగవ్వకూడదు.. మనం చెల్లించిన డబ్బులకు సంబంధించిన డేటా మనదే కావాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై ట్రాయ్, కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు.
Read Also: ఉద్యోగులకు భారీ షాక్.. శాలరీ కటింగ్స్ కి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
Follow Us On: X(Twitter

