Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతిరోజూ ఫుల్ బాటిల్​ తాగేవాడిని.. అమీర్​ ఖాన్​ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇటీవల ‘డ్యూలాగ్ విత్ బరున్ దాస్’ అనే టాక్ షోలో పాల్గొన్న ఆయన, తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకుల సమయంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి మాట్లాడారు. 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్న ఆమీర్, 2002లో ఆమెతో విడిపోయారు. ఆ విడాకుల తర్వాత తాను తీవ్రమైన మనోవేదనకు గురయ్యానని, ఆ బాధను తట్టుకోలేక మద్యానికి బానిసయ్యానని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ ఫుల్ బాటిల్ మద్యం తాగేవాడినని చెప్పారు.

రీనా దత్తాతో (Reena Dutta) విడిపోయిన తర్వాత 2005లో కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్న అమీర్, 2021లో ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. అయితే ఇటీవల తన 60వ పుట్టినరోజు సందర్భంగా గౌరీ స్ప్రాట్‌ను తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వరుస వైవాహిక బంధాల విచ్ఛిన్నం, ఆపై ఎదురైన మానసిక పరిస్థితుల నుంచి తాను ఎలా బయటపడ్డాడో వివరిస్తూ అమీర్  (Aamir Khan) చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: అమ్మాయిలకు గుడ్​‌న్యూస్​.. పెళ్లితో క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>