కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావడంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ (KCR) వస్తున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారని, అయినా కేసీఆర్ కేవలం సంతకం పెట్టడానికే సభకు వచ్చారని ఎద్దేవా చేశారు.
అనర్హతకు గురి అవుతారనే భయంతోనే కేసీఆర్ సంతకం పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా సభలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సింది పోయి అలా చేయకుండా కేవలం విధివిధానాలను పాటించడానికే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా వారి తరఫున మాట్లాడకుండా కేసీఆర్ బాధ్యతను విస్మరించారన్నారు.
అసెంబ్లీ అనేది రాజకీయ డ్రామాలకు వేదిక కాదని ఆది శ్రీనివాస్ అనారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కేంద్ర బిందువుగా ఉండాలని, అసెంబ్లీలో లోపల రాజకీయాలు చేయకుండా వ్యవహరించాలని సభ్యులకు శ్రీనివాస్ (Aadi Srinivas) సూచించారు.
Read Also: అసెంబ్లీ 15 రోజులు నిర్వహించాలి: హరీష్ రావు డిమాండ్
Follow Us On: Instagram


