epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హాస్టల్ లో స్టూడెంట్ ను చితకబాదిన వార్డెన్..

కలం, వెబ్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలో ఉండే ఎస్సీ గర్ల్స్ హాస్టల్ (Girls Hostel) లో దారుణం జరిగింది. ఓ స్టూడెంట్ ను వార్డెన్ చితక బాదింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని టైమ్ కు హాస్టల్ కు రాలేదనే కారణంతో వార్డెన్ కర్ర, చేతులతో విచక్షణారహితంగా కొట్టింది. ఈ ఘటన గత నెల 24న జరగ్గా.. కొందరు విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఒకవేళ స్టూడెంట్ తప్పు చేసి ఉంటే వాళ్ల పేరెంట్స్ ను పిలిచి చర్యలు తీసుకోవాలి గానీ.. ఇలా చావబాదడం ఏంటని విద్యార్థి నాయకులు మండిపడుతున్నారు. ఇదే హాస్టల్లో గతంలో విద్యార్థుల చేత మత బోధనలు చేయించడం వివాదాస్పదం అయింది.

Read Also: ఐబొమ్మ రవి కస్టడీ పూర్తి.. ప్రహ్లాద్ డాక్యుమెంట్ల చోరీపై అనుమానాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>