కలం, వెబ్ డెస్క్: న్యూజీలాండ్ ఆల్‌రౌండర్ డగ్ బ్రేస్‌వెల్ (Doug Bracewell) అన్ని ఫార్మాట్స్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించాడు. 2011 నుంచి 2023 వరకు 28 టెస్ట్‌లు, 21 వన్డేలు, 20 టీ20ల్లో న్యూజీలాండ్ తరఫున ఆడిన బ్రేస్‌వెల్, ఎంతోకాలంగా ఉన్న రిబ్(పక్కటెముక) గాయం కారణంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టులో రాబోయే సీజన్‌లో పాల్గొనలేకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణమైంది.
బ్రేస్‌వెల్ 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. హోబార్ట్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో 9 వికెట్లు తీసి 60 పరుగులే ఇవ్వడంతో ఆస్ట్రేలియాలో 26 ఏళ్ల తర్వాత న్యూజీలాండ్‌కు టెస్ట్ విజయాన్ని అందించాడు. ఈ ఘనత బ్రేస్‌వెల్‌కు విశేష గుర్తింపును తెచ్చింది. టెస్ట్‌లో 74 వికెట్లు, వైట్‌బాల్‌లో 46 వికెట్లు సాధించాడు.
రిటైర్మెంట్ సందర్భంగా బ్రేస్‌వెల్ (Doug Bracewell) తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. “నా జీవితంలో క్రికెట్ చాలా పెద్ద భాగం. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాలనేది నా కల. ఆ దిశగా నేను చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అందుకే నా దేశం తరఫున ఆడే అవకాశం దక్కింది. అది నాకు చాలా గర్వకారణం. అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఒక ప్రత్యేక గౌరవం” అని తెలిపాడు.
Read Also: విజయ్ హజారే.. ఆంధ్ర, హైదరాబాద్ ఓటమి
Follow Us On: X(Twitter)


