కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోం: వినయ్ భాస్కర్

కలం, హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులకు భయపడేది లేదని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా క్షేత్రంలోనే ఉన్నామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) తెలిపారు. బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాలుగో డివిజన్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం హనుమకొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. 30 ఏళ్ల ప్రజా జీవితంలో తాను ఎన్నడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదన్నారు. మాజీ కార్పొరేటర్ బొంగు అశోక్‌పై కుట్రపూరితంగా కేసులు పెట్టారని మండిపడ్డారు.

తమ హయాంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీ వాళ్లనే తేడా లేకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించామన్నారు. నాలుగో డివిజన్‌లో రూ. 55 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. చేసిన పనులు చెప్పుకోకపోవడం వలనే ఎన్నికల్లో ఓటమి ఎదురైందని వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీ నారాయణ, జోరిక రమేష్, డివిజన్ ఇన్‌ఛార్జి ప్రదీప్ రెడ్డి, నాయకులు డా.కంజర్ల మనోజ్ కుమార్, ఇస్మాయిల్, పార్వతి, దశరథ్, బైరపాక ప్రశాంత్, సారిక, శ్యామ్ సుందర్ రెడ్డి, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read Also: ఇకపై బైక్ హ్యాండిల్ వదిలేస్తే దబిడి దిబిడే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>