Mobile Popup Ad
Mobile Popup Ad

రన్నింగ్ బైక్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru)మండలం సీఎస్‌పీ లారీ కాటా సమీపంలో ఆదివారం ఒక మోటార్ సైకిల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తూ బైక్ నడుపుతున్న యువకుడు తృటిలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. విజయనగరం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ అనే యువకుడు తన బైక్‌పై మణుగూరు నుంచి భయ్యారం వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీఎస్‌పీ లారీ కాటా సమీపంలోకి రాగానే బైక్ ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు రావడం ప్రారంభమైంది.

బైక్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రేమ్ కుమార్ వెంటనే అప్రమత్తమయ్యాడు. క్షణాల్లో బైక్‌ను రోడ్డు పక్కన నిలిపివేసి, దానికి దూరంగా పరుగెత్తాడు. ఆయన దూరంగా వెళ్లిన కాసేపటికే మంటలు బైక్ అంతటా వ్యాపించాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రేమ్ కుమార్‌కు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. రోడ్డుపై బైక్ తగలబడుతుండటాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే స్పందించి మణుగూరు ఫైర్ స్టేషన్‌కు (Manuguru Fire Station) సమాచారం అందించారు. కాగా, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also: ఇకపై బైక్ హ్యాండిల్ వదిలేస్తే దబిడి దిబిడే

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>