ప్రజావాణి కార్యక్రమం వాయిదా: కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ వార్డు సభల నిర్వహణతో పాటు ఎస్‌ఐఆర్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాలలో అధికారులు పాల్గొననున్న నేపథ్యంలో ఈనెల 8వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని(Prajavani Program) తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్(Collector Rizwan Basha Shaik) ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Rizwan Basha) మాట్లాడుతూ.. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురి కాకూడదని కోరారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేసినప్పటికీ, తదుపరి సోమవారం నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అధికారుల ఇతర విధి కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

Read Also: నేపాలీ దోపిడి ముఠా అరెస్ట్​.. వెలగులోకి షాకింగ్​ నిజాలు..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>