షమీపై ఇషాన్ కిషన్ సంచలన వ్యాఖ్యలు!

కలం, స్పోర్ట్స్ : మహ్మద్ షమీ వయసు 36కి చేరింది. కానీ అతడి ఆటపై ఆకలి మాత్రం తగ్గలేదని ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) తెలిపాడు. భారత జట్టులోకి తిరిగి రావాలన్న షమీ పట్టుదల తనకు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాడు. దులీప్ ట్రోఫీలో షమీ (Mohammed Shami) అద్భుతంగా రాణించాడు. సెంట్రల్ జోన్‌తో సెమీఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు.

100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 903 వికెట్లు తీసుకున్న షమీ.. తన అనుభవాన్ని మరోసారి చూపించాడు. వయసు షమీకి అడ్డంకి కాదని ఇషాన్ అభిప్రాయపడ్డాడు. కష్టపడే తత్వం, వికెట్లు తీయాలన్న ఆకలి ఉంటే వయసుతో సంబంధం లేదని తెలిపాడు.

సెమీఫైనల్లో షమీ అదనపు ఓవర్లు అడిగి మరీ వికెట్లు తీయాలని ప్రయత్నించాడని ఇషాన్ (Ishan Kishan) చెప్పాడు. అలాంటి బౌలర్ జట్టులో ఉండటం కెప్టెన్‌కు ఎంతో నమ్మకాన్ని ఇస్తుందని వివరించాడు. బ్యాటింగ్‌లోనూ షమీ రెండు బౌండరీలు కొట్టాడు. దీంతో ఇషాన్ అతడిని సరదాగా ఆల్‌రౌండర్‌గా అభివర్ణించాడు. ఇక ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. 2012-13 తర్వాత తొలిసారి టైటిల్ గెలవాలని చూస్తోంది. ఫైనల్లో సౌత్ జోన్‌తో తలపడనుంది.

Also Read : ఏషియన్ గేమ్స్‌.. బీసీసీఐకి ఐఓఏ షాక్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>