కలం, వెబ్ డెస్క్: చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు భక్తవత్సలం పిళ్లై అనే టీచర్‌ను చూసి భయపడేవాడినని సీఎం చంద్రబాబు (CM Chandrababu) గుర్తు చేశారు. బాగా కొట్టేవారని, ఆయన వచ్చారంటే శ్రద్ధగా చదువుకునేవారమన్నారు. విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా జెన్ జీ, జెన్ ఆల్ఫా అంటున్నామని.. మారిన పరిస్థితుల్లో పిల్లలను కొట్టడం కాదు కదా, గట్టిగా తిట్టే పరిస్థితి కూడా లేదన్నారు. అంత సున్నితంగా మారిపోయారని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
విద్యా శాఖ అంటే ఆలోచించాను..
లోకేశ్ (Nar Lokesh) విద్యా శాఖను తీసుకుంటానని చెప్పినప్పుడు ఆలోచించానని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. విద్యా శాఖను సవాల్‌గా తీసుకుని ప్రక్షాళన చేస్తానని చెప్పినప్పుడు గర్వపడ్డానని గుర్తు చేశారు. అలాంటి కీలక శాఖను తీసుకుని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని వివరించారు. భవిష్యత్తు అంతా విద్యార్థుల మీదే ఆధారపడి ఉంటుందన్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడేవారమని, ఇప్పుడు మాత్రం ఇంకా పెరగాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా జనాభా తగ్గుతోందని, ఫెర్టిలిటీ రేటు 2.1 శాతం పెరగాలని పిలుపునిచ్చారు. జనాభా తగ్గిపోతే అనేక సమస్యలు వస్తాయని చంద్రబాబు హెచ్చరించారు.
Also Read : మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే: జగన్
Follow Us On: X(Twitter)

