25 దొంగతనాల గుట్టురట్టు… ‘టైగర్స్‌ టాస్క్‌ఫోర్స్‌’ పోలీసులకు చిక్కిన దొంగల ముఠా!

కలం, నిర్మల్ : దేవాలయాలు, ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ జానకి షర్మిల శనివారం తెలిపారు. టైగర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నట్టు పేర్కొన్నారు. నిర్మల్ ( Nirmal)  జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన 25 చోరీ కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి, 16 కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసినట్టు తెలిపారు.

నిందితుల నుంచి సుమారు 12 కిలోల వెండి ఆభరణాలు, ఆలయ కిరీటాలు, రూ.67 వేల నగదు, కారు, మెల్టింగ్‌ మెషిన్‌, గ్యాస్‌ పైప్‌ మెషిన్‌ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిర్మల్‌ (Nirmal) తో పాటు ఆంధ్రప్రదేశ్‌ లోని ఏలూరు, గన్నవరం ప్రాంతాల్లో జరిగిన చోరీల్లోనూ నిందితుల ప్రమేయం ఉన్నట్టు తెలిపారు. కేసుల ఛేదనలో కృషి చేసిన భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. దొంగతనాల నియంత్రణకు టైగర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ ద్వారా ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.

Also Read : కేబినెట్‌లో చోటు ఎవరికి.. నిజామాబాద్ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>