మంత్రి జూపల్లి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా

కలం, నిర్మల్ : మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం బాసరలో పర్యటించి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, గోదావరి నది పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి.. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాల షెడ్యూల్‌కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం భైంసా తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. నోటీసుల జారీ, తదుపరి ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>