Mobile Popup Ad
Mobile Popup Ad

నేపాలీ దోపిడి ముఠా అరెస్ట్​.. వెలగులోకి షాకింగ్​ నిజాలు..!

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిచించిన నేపాలీ ముఠా (Nepali Theft Gang) దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. సికింద్రాబాద్ కౌకూర్‌లో రిటైర్డ్ ఆర్బిట్రేటర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నేపాలీ ముఠాకు చెందిన ప్రధాన నిందితులు మీనా, రాజేశ్​, డేనియల్​ చారో, కిరణ్​ లను మల్కాజ్​ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు సంబంధించిన వివరాలను సీపీ సుమతి మీడియాకు వెల్లడించారు.

సికింద్రాబాద్ కౌకూర్‌లో రిటైర్డ్ ఆర్బిట్రేటర్ ఇంట్లో నేపాల్​ ముఠాకు చెందిన మీనా, రాజేష్​ లు పనిమనిషిగా చేరారు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం బీరువాలో ఉన్న కోట్ల విలువైన బంగారం, వెండి, డాలర్లు కాజేశారు. 5 రోజుల్లోనే 255 సీసీటీవీల ఆధారంగా చోరీ చేసిన నేపాలీ ముఠాను అరెస్ట్ చేశామని మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>