ప్రభుత్వ ఆహ్వాన పత్రికల్లో గిరిజన ‘కోయ’ భాష.. ఐటీడీఏ వినూత్న ప్రయోగం! ​

కలం, ఖమ్మం బ్యూరో: ఇప్పటివరకు కేవలం మాట్లాడటానికే పరిమితమైన గిరిజన ప్రాంతాల ‘కోయ’ భాషకు ఐటీడీఏ భద్రాచలం (ITDA Bhadrachalam)  అధికారిక గౌరవాన్ని కల్పించింది. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంతో పాటు, నేటి తరం యువతకు తమ మాతృభాషపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వ అధికారిక పత్రికల్లో కోయ భాషను ప్రోత్సహిస్తూ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (పీఓ) బి. రాహుల్ సరికొత్త లీడ్ తీసుకున్నారు.

సాధారణంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ఆహ్వానాలు తెలుగు లేదా ఆంగ్లంలో మాత్రమే ఉంటాయి. కానీ, గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఈసారి ఆహ్వాన పత్రికలను కోయ భాషలో, అందరికీ అర్థమయ్యేలా తెలుగు లిపిని ఉపయోగించి రూపొందించారు. కేవలం మాట్లాడటానికే వాడే ఒక గిరిజన భాషకు, ఈ విధంగా ప్రభుత్వ ఆహ్వాన పత్రికల ద్వారా లిఖితపూర్వక రూపం ఇవ్వడం గిరిజన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

Read Also: నేపాల్‌తో బంధం మరింత స్ట్రాంగ్: ప్రధాని మోదీ!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>