Mobile Popup Ad
Mobile Popup Ad

రవితేజ ‘ఇరుముడి’ గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్

కలం, సినిమా : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, గాఢమైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథగా ఉండబోతోందనే సంకేతాలను ఇచ్చింది. గ్లింప్స్‌లో  ప్రధానంగా తండ్రీ–కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో హృద్యంగా చూపించారు. చిన్నారి పాత్రతో రవితేజకు ఉన్న ఎమోషనల్ బాండింగ్ కథకు ప్రధాన బలంగా కనిపిస్తోంది. అదే సమయంలో చిత్రంలో డివోషనల్ టచ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంలో కథ సాగనున్నట్లు గ్లింప్స్‌లోనూ చూపించినా.. ఈ సినిమా పూర్తి భక్తి చిత్రంగా కాకుండా, కుటుంబ భావోద్వేగాలు, డ్రామా, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవితేజ అభిమానులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ కాలేదు. ఎమోషనల్ జర్నీ మధ్యలో ఆయన మార్క్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన హింట్ ఇవ్వడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.  ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని (Irumudi) నిర్మిస్తోంది. శివ నిర్వాణ ఎమోషనల్ టచ్‌, రవితేజ మాస్ ఇమేజ్‌ కలయికగా వస్తున్న ఈ సినిమా టాలీవుడ్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు వేదిక ఖరారు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>