epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై సీఎం కామెంట్

కలం డెస్క్ : ఫార్ములా ఈ-రేస్ (Formula E Race) కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కొంత క్లారిటీ ఇచ్చారు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉన్నదని, త్వరలోనే కొలిక్కి వస్తుందన్నారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో నిందితుడిగా ఉన్న కేటీఆర్‌ను (KTR) ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ (Governor) నుంచి ఏసీబీకి పర్మిషన్ వచ్చిందని గుర్తుచేశారు. ఇదే కేసులో అప్పటి పురపాలక శాఖ (MAUD) ముఖ్య కార్యదర్శిగా (Principal Secretary) ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (IAS Aravind Kumar) కూడా నిందితుడిగా ఉన్నారని గుర్తుచేశారు. ఆయనను ప్రాసిక్యూట్ చేయాలంటే డీవోపీటీ (DoPT) నుంచి అనుమతి అవసరమన్నారు. ఇందుకోసం ఇప్పటికే రెండు లేఖలు రాశామని, పర్మిషన్ రాగానే ఆయనపైనా విచారణ మొదలవుతుందన్నారు. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మనీ లాండరింగ్‌పై ఈడీ సైతం :

పార్మలా ఈ-రేస్(Formula E Race) నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. విదేశీ కరెన్సీ రూపంలో ప్రభుత్వం నుంచి నిర్వాహకులకు చెల్లింపులు జరిగాయని తేలింది. ఏసీబీ పోలీసులు సైతం చార్జిషీట్‌లో దీన్నే పేర్కొన్నారు. కేటీఆర్ ప్రమేయంపై కొన్ని అభియోగాలను పేర్కొన్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సైతం దర్యాప్తుకు సిద్ధమవుతున్నది. ఎఫ్ఐఆర్ మొదలు ఛార్జిషీట్ వరకు పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులకు (SIT) ఈడీ లేఖ రాసింది. ఇదే సమయంలో గవర్నర్ నుంచి కూడా అనుమతి కోసం ఈడీ ప్రయత్నిస్తున్నది. ఎప్పుడైనా కేటీఆర్‌ను ఈడీ, ఏసీబీ అధికారులు మళ్ళీ విచారణకు పిలిచే అవకాశమున్నది. డీవోపీటీ నుంచి అనుమతి రాగానే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను కూడా ఏసీబీ ప్రాసిక్యూట్ చేయనున్నది. దర్యాప్తుకు అవసరమైన అన్ని రకాల ప్రొసీజర్‌లను పాటిస్తున్నామని సీఎం రేవంత్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Read Also: ఒమన్​తో ఒప్పందం రెండు దేశాలకూ కొత్త శక్తి: ప్రధాని మోదీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>