epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

శుభ్‌మన్ గిల్‌పై వేటు.. గాయమా ఫామ్ లేకపోవడమా?

కలం, వెబ్ డెస్క్: శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది. దక్షిణాఫ్రికాతో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు గిల్(Shubman Gill) దూరమయ్యాడు. వాతావరణం కారణంగా నాలుగో టీ20 రద్దు అయింది. కాగా త్వరలో జరిగే ఐదో మ్యాచ్‌కు కూడా గిల్.. జట్టులో ఉండడు. ప్రాక్టీస్ సమయంలో కాలి బొటన వేలికి గాయం కావడంతో గిల్‌ను జట్టు నుంచి తప్పించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆ గాయం వల్లే నాలుగవ, ఐదవ టీ20 మ్యాచ్‌లకు గిల్ దూరమయ్యాడు. గాయం తీవ్రతను పరిశీలించిన వైద్యులు విశ్రాంతి అవసరమని తెలిపినట్లు బీసీసీఐ చెప్పింది.

అయితే గిల్‌ను జట్టు నుంచి తప్పించడానికి గాయం ఒక సాకు మాత్రమేనన్న వాదన వినిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో గిల్ చాలా పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు టీ20 మ్యాచ్‌లలో కలుపుకుని మొత్తం 32 పరుగులే చేశాడు. గత 15 టీ20 మ్యాచ్‌ల 24.25 సగటుతో 291 పరుగులు మాత్రమే చేశాడు. ఆ కారణంగానే శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ(BCCI) దూరం పెట్టిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు గిల్(Shubman Gill) జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో ఓపెనర్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం దక్కుతుందని సమాచారం. తుది జట్టులో అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో బీసీసీఐ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. గిల్ కోసం మంచి ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌(Sanju Samson)ను గతంలో తుది జట్టుకు దూరం పెట్టడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గిల్‌ను గాయం కారణంగా తప్పించారనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. వీటిపై బీసీసీఐ ఎలా స్పిందిస్తుందో చూడాలి.

Read Also: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్స్.. వడ్డీ ఎక్కువ రిస్క్ తక్కువ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>